జాతీయ సుస్థిర సుగంధ ద్రవ్యాల కార్యక్రమం

1182చూసినవారు
జాతీయ సుస్థిర సుగంధ ద్రవ్యాల కార్యక్రమం
రేగొండ మండలంలోని కొత్తపల్లి గోరి గ్రామ పంచాయితీ అవరణలో జాతీయ సుస్థిర సుగంధ ద్రవ్యాల కార్యక్రమం మరియు మిర్చి పంట పై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సంస్థ ప్రతినిదులు మాట్లాడుతూ. రైతులు పంటల దిగుబడి పెరగాలంటే కచ్చితంగా భూసార పరీక్షలు నిర్వహించాలని, పచ్చి రొట్టె, ఎరువులు, విత్తన శుద్ధి గురించి వివరించారు. అలాగే రైతులు మడులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎత్తైన నారు మడులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే విత్తన రక్షణ కొరకు షేడ్ నెట్ ఉపయోగించాలి అన్నారు. వీటితొ పాటుగా ద్రవ, ఘన, జీవామృతం గురించి, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ దిగుబడి ఎలా తీయాలనే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ ఎస్ ఎస్ పి ప్రతినిధిగా ఉపేందర్ రెడ్డి, పసిడి పంటల సంస్థ నుండి వై వెంకటేశ్వర్లు, రఘు, రేగొండ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు బట్టు శ్రీనివాస్, యాట రాజన్న మరియు రైతులు ఆప్పని చంద్రమొలి, చిలుక చేరాలు, బొడకుంట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్