సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేగొండ మండలంలోని కొత్తపల్లి గోరి గ్రామంలో బుధవారం సాయంత్రం యూనిక్ యూత్ అధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ ను సర్పంచ్ ఎస్. రజిత రాజయ్య ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు రగుసాల తిరుపతి, మండల తెరాస యూత్ అధ్యక్షుడు పకిడే కిరణ్, సీనియర్ నాయకులు వీరేశం, నిమ్మల శంకర్, నేరెళ్ళ బిక్షపతి, నిమ్మల రాజు, స్నేహ యూత్ అధ్యక్షుడు నామాల వినయ్, గ్రామ క్రీడా అధ్యక్షుడు ఆవుల రాజు, ఛాలెంజ్ యూత్ సభ్యులు ప్రకాష్, సునీల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.