భూపాలపల్లి జిల్లా పోలంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ సమీపంలో ఉన్న అడవి ఆముదం కాయలను విద్యార్థులు తిన్నారు. వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి ఉపాధ్యాయులు తరలించారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వినయశ్రీ, రుత్విక్, వర్షన్, వైష్ణవి, హర్ష, హర్షిత, మహాలతి, శ్రీ వైష్ణవి అనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.