మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల లో శనివారం ఉదయం పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. రహదారి పై ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకుండ ఉండడంతో పలు వాహన దారులు రోడ్డు పై నెమ్మదిగా వెళ్లాయి. పొగ మంచు వల్ల ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరుతున్నారు.