గుండాల దాడిలో గాయపడ్డ హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోట పవన్ ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పరామర్శించారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ. పవన్ మీద జరిగిన దాడి హత్యయత్నం అని, ముందే ప్రణాళికతో దాడికి పాల్పడినారు అన్నారు. 4సార్లు ఎమ్మెల్యే అయిన దాస్యం నియోజకవర్గంలో అభివృద్ది చేయలేక విమర్శించిన వారి పైన దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని, రానున్న రోజుల్లో తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.