Sep 16, 2024, 12:09 IST/
అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తగలబడిన లారీ (వీడియో)
Sep 16, 2024, 12:09 IST
ఏపీలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై ఓ లారీ దగ్ధమైంది. ముద్దనూరు నుంచి చెన్నైకి ఇసుక తీసుకెళ్తుండగా లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాగా, లారీలో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.