విద్యార్థి యువజన సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ పిలుపులో భాగంగా గురువారం బయ్యారం మండల కేంద్రంలోని పిడిఎస్యు ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బంద్ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ కి పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.