వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా బొల్లం రమేష్

957చూసినవారు
వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా బొల్లం రమేష్
నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా బొల్లo రమేష్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 10. 45 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఆలయనికి విచ్చేసే సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి బి, సోమేశ్వరరావు, మండల కార్యదర్శి ఉపేందర్, బొల్లం సోమన్న, వంగపల్లి సీతారాములు, మా శెట్టి వెంకన్న, యుగంధర్, ఇమ్మడి నాగన్న, సంతోష్, మహేష్, సిహెచ్ విక్రమ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్