మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కొబ్బరి చిప్పల సేకరణకు శనివారం బహిరంగ వేలం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఏడాదికి గాను సిద్ధార్థ అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ, పాలకమండలి ధర్మకర్తలు పాల్గొన్నారు.