డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో నిన్న రాత్రి గాలివానకి చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభం విరిగి పడటంతో విద్యుత్ లైన్ తెగిపడింది. గురువారం విద్యుత్ అధికారులు స్పందించి కొత్త పోల్ ని ఏర్పాటు చేసి విద్యుత్ లైన్ కి మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరాను ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మి కాంత్, జూనియర్ లైన్ మెన్ రంగారావు, హెల్పర్స్ కిషన్, వెంకట్రాజు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.