టేకు దుంగలను స్వాధీనం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గోదావరి కరకట్ట వద్ద శనివారం అక్రమంగా నిల్వ చేసిన ముడు లక్షల విలువైన టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ ఇంజన్ తో పాటు,12 టేకు దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.