అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఏటూరునాగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన ఆదినారాయణ మల్యాల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండకు తరలిస్తున్న క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు మృతి చెందాడని శనివారం కుటుంబ సభ్యులు తెలిపారు.