ఏటూరునాగారంలో వరద బాధితులకు సహాయం అందజేత

64చూసినవారు
ఏటూరునాగారంలో వరద బాధితులకు సహాయం అందజేత
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తిన కొండాయి, మల్యాల, ఐలాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు భూక్య జంపన్న తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు. బాధితులు అధైర్యపడవద్దని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుండారపు రాజు, ఎంపెళ్లి రాజు, గణేశ్ రెడ్డి, నాగార్జున, సర్వేశం, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్