చేర్యాల మున్సిపల్ సాధారణ సమావేశం ఛైర్మన్ అంకుగారి స్వరూప రాణి, కమిషనర్ నాగేందర్ ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. ఈ సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ, నీటిసరఫరా, పట్టణంలోని పలు సమస్యలపైన చర్చించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మేనేజర్ ప్రభాకర్, ఏఈ శ్రీనాథ్, వార్డ్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.