చేర్యాల మండలం తాడూర్ గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో శనివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.