ఈ నెల 29న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ తెలిపారు. సిద్దిపేట సీపీ డాక్టర్ అనురాధ ఆదేశాల మేరకు పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.