జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కొత్త రేషన్ కార్డుల అమలుకు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా మరియు ఇంద్రమ్మ గృహ నిర్మాణాల ఎంపిక ఏ విధంగా చేయాలో వివరించడం జరిగింది. ఈ సమావేశంలో తహసిల్దార్, బీసీ సోషల్ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్, అన్ని గ్రామాల ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.