జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ గ్రౌండ్లో ఆదివారం మూడోరోజు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్లో మేడ్చల్, మహబూబాబాద్ జిల్లాల జట్లు పోటీ పడగా మేడ్చల్ జట్టు విజయం సాధించింది. 33 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.