భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఎంపీ లాడ్స్ నిధులతో కొమురవెల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద హైమాస్ట్ లైట్స్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమురవెల్లికి హైమాస్ట్ లైట్ మంజూరు చేసిన ఎంపీకి, ప్రతిపాదించిన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.