జనగాం నగరంలోని ధర్మకంచకి చెందిన దాసరి ప్రకాష్ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఈ మేరకు ఆసుపత్రిలో వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన ఒక లక్ష యాబై వేల రూపాయల ఎల్వోసిని కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.