ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో పలువురు రైతులు అధికారులతో గొడవకు దిగి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రైతువేదికలో ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 లక్షల లోపు రుణమాఫీ తమకు కాలేదని రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు రైతులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.