తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి ఘనస్వాగతం
కాజీపేట మండలం మడికొండలోని బసవరాజు సారయ్య పెట్రోల్ పంపు దగ్గర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘన స్వాగతం పలుకుతున్నారు. పూల మాలలు వేసి శాలువాతో స్వాగతం పలికిన వారిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.