మహబూబాబాద్ మార్కెట్ కు 4 రోజుల సెలవు

1081చూసినవారు
మహబూబాబాద్ మార్కెట్ కు 4 రోజుల సెలవు
మహబూబాబాద్ మార్కెట్ కు 4 రోజుల సెలవు ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి బుధవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఏప్రిల్11 గురువారం, 12 శుక్రవారం రంజాన్ పండుగ ప్రభుత్వ సెలవు, 13 శనివారం, 14ఆదివారం వారాంతపు సెలవుల సందర్భంగా మార్కెట్ యార్డునకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఏప్రిల్15సోమవారం మార్కెట్ నందు క్రయ విక్రయాలు జరుగుతాయని రైతు సోదరులు, వ్యాపారస్తులు ఇట్టి విషయమును గమనించి సహకరించగలరు.