అయ్యప్ప పంబారట్టు పెరుమాళ్ళ సంకీస పెద్ద చెరువులో కన్నులపండువగా జరిగింది. జల క్రీడలో భాగంగా గురుస్వామి బిక్షం అయ్యప్ప స్వామికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బస్వం, పంచదార, గంధం, పసుపుతో అభిషేకం చేశారు. సంకీస అయ్యప్ప పంబారట్టు ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలై లోని పంబా నదిలో ఏ విధంగా జరుగుతుందో అదే రీతిలో ఉత్సవాలు జరిపారు. స్వామిని ప్రతిష్ఠించి రథాన్ని నడిపి ఊరేగింపును ప్రారంభించారు.