మహబూబాబాద్ పట్టణంలో సోమవారం రాత్రి ఓ మెడికల్ షాప్ లో దొంగ చోరీ కి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారు జామున జరిగిన దొంగతనం సీసీ కెమెరా పోలీసులకు పట్టించింది. కర్రల సహాయం తో షటర్ ను తొలగించి లోపలికి వెళ్లిన దొంగను చాకచక్యంగా గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకొన్న పోలీసులు విచారణ చేస్తున్నారు. షాపు లో దొంగిలించిన నగదు స్వాధీనం చేసుకున్నారు.