ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని జిల్లా కలెక్టర్ తెలిపారు. నకిలీ ఖాతా ద్వారా డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారన్నారు. మీటింగులో ఉన్నానని, అర్జెంటుగా డబ్బులు కావాలంటూ పలువురికి మెసేజ్ లు చేస్తుండటంతో కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనపేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని కలెక్టర్ కోరారు.