అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ తాగునీటి వనరులను గుర్తించాలి

64చూసినవారు
ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నీటి సరఫరా పర్యవేక్షణపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా యుద్ధ ప్రాతిపదికన పని చేయాలన్నారు. రాబోయే 2 నెలల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తాగు నీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్