రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన వాజేడు ఎస్సై హరీష్ మృతదేహాన్ని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పరిశీలించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద రిసార్ట్ లోని మృతిదేహం వద్దకు చేరుకొని ఆత్మహత్య కారణాలపై ఆరా తీశారు. అనంతరం రిసార్ట్ ఆవరణలో గల ఎస్సై తల్లిదండ్రులను ఎస్పీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.