వినాయక చవితి ఉత్సవాలకు డిజేలు పెట్టొద్దు: సిఐ

70చూసినవారు
వినాయక చవితి ఉత్సవాలకు డిజేలు పెట్టొద్దు: సిఐ
ములుగు, నూగూరు, వెంకటాపురం సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాలకు ఎవరు కూడా డి. జె సౌండ్ సిస్టంలను పెట్టొద్దని సిఐ బండారి కుమార్ ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల వద్ద, నిమజ్జనం రోజు కూడా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే డిజే బాక్సులను పెట్టొద్దన్నారు. నిమజ్జనం రోజు ఇతర మతాలకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు చేయొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్