జయశంకర్ జిల్లా గణపురం మండలం ములుగు- పరకాల ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు భారీ వృక్షం రోడ్డుమీద నేలకొరిగింది. దీంతో ములుగు పరకాలకురాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 15 వేడుకలకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఉద్యోగులు కార్మికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించిరోడ్డుమీద కూలిన భారీ వృక్షాన్ని తొలగించాలనికోరుకుంటున్నారు.