ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ రౌడీలు, గుండాలు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ములుగు మాజీ జడ్పీ ఛైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ చేతులు కట్టుకొని కూర్చునే పార్టీ కాదని, తిరిగి దాడులు చేసేందుకు తాము కూడా సిద్ధమన్నారు. పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ అని అన్నారు.