ఒత్తిడిని జయిస్తే.. విజయం సాధ్యం: నమ్రత

60చూసినవారు
ఒత్తిడిని జయిస్తే.. విజయం సాధ్యం: నమ్రత
ప్రతి వ్యక్తి ఒత్తిడిని జయించినప్పుడే విజయం సాధ్యమవుతుందని ములుగు ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి నమ్రత అన్నారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ స్ట్రెస్ మేనేజ్మెంట్ పాటించినప్పుడే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు.