ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని తాడ్వాయి - మేడారం మార్గంలో అకాల వర్షాలకు నేల కూలిన అటవీ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ. వందల ఏళ్ల నాటి వృక్షాలను కోల్పోవడం బాధాకరమని, సుమారుగా 150 హెక్టార్ల వరకు నష్టం వాటిల్లిందని, అడవులకు జరిగిన నష్టంపై అధికారులు సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు.