ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పి శబరీష్ తో కలిసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.