సరసనపల్లి గ్రామాన్ని సందర్శించిన మిషన్ భగీరథ అధికారులు

81చూసినవారు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో ఉన్న సరసనపల్లి గ్రామాన్ని శుక్రవారం మిషన్ భగీరథ అధికారులు సందర్శించారు. గ్రామంలో ప్రజలు త్రాగు నీటి కోసం చెరువులు, కుంటలలో నీటిని తెచ్చుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామాన్ని అధికారులు సందర్శించారు. గ్రామంలో మంచినీటి కొరత ఏమి లేదని తేల్చేశారు. కేవలం పశువుల తాగునీటికి మాత్రమే ఇబ్బందిగా ఉందని అన్నారు. గ్రామానికి మంచినీటి పంపిణీని సైతం పెంచుతామన్నారు.

సంబంధిత పోస్ట్