ములుగు: మానవత్వం చాటుకున్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్

65చూసినవారు
ములుగు: మానవత్వం చాటుకున్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
ములుగు జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాంపతి మానవత్వం చాటుకున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ తన కుటుంబీకులతో భద్రాచలంలో దైవ దర్శనం చేసుకొని మేడారం వెళ్తుండగా మంగళవారం తాడ్వాయి-పస్రా మధ్య వారి వాహనం చెట్టును ఢీకొంది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న సివిల్ సప్లైస్ డీఎం రాంపతి క్షతగాత్రులను 108 అంబులెన్సు, తన వాహనంలో ములుగు ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్