ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ఉపాధ్యాయులు తమ స్వంత పిల్లలుగా చూసుకోవాలని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ వారిని సన్మార్గంలో ప్రయాణించేలా చూడాలని ఉపాధ్యాయులకు మంత్రి సీతక్క తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.