ములుగు: జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం: మంత్రి సీతక్క

81చూసినవారు
ములుగు: జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం: మంత్రి సీతక్క
ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ దివాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో మినీ మేడారం గురించి నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడానని తెలిపారు. త్వరలో టాస్క్ ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు లభించబోతున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్