పోషకాహారం మనిషికి అమృతం లాంటిది: మంత్రి సీతక్క

54చూసినవారు
పోషకాహారం మనిషికి అమృతం లాంటిది: మంత్రి సీతక్క
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ములుగు ఆధ్వర్యంలో పోషణ్ - మాసం సంబరాల జిల్లాస్థాయి ముగింపువేడుకల కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. పోషకాహారం మనిషికి అమృతం లాంటిదన్నారు. గర్భిణులు, బాలింతలు చిన్నారుల్లో పోషణ లోపాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని తెలిపారు.

సంబంధిత పోస్ట్