డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 1 నుండి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసినప్పుడు నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ కు సర్టిఫికెట్ల పరిశీలన మెసేజ్ వస్తుందన్నారు. సంబంధిత అభ్యర్థులు పూర్తి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలని కోరారు. ఉదయం 10 గంటలకు సకాలంలో హాజరై వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.