ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి వరదపోటుతో మరిమాగు వంతెనపై వరదనీరు భారీగా చేరింది. దీంతో చండ్రుపట్ల - పేరూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా వరద ప్రవాహం వస్తుండటంతో స్థానిక ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.