వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గురువారం బిఆర్ఎస్ నాయకులు, బిఆర్ఎస్ మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లబెల్లిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.