గాయపడిన అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి: ఎస్ఎఫ్ఐ

593చూసినవారు
గాయపడిన అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి: ఎస్ఎఫ్ఐ
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నల్గొండ జిల్లాలో దాడిని ఖండిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి అమ్మాయిలకు పూర్తి రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కేవలం మాటలకు మాత్రమే తప్ప షీ టీమ్స్ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే నల్గొండ జిల్లాలో ఓ ప్రేమోన్మాది నవ్య అనే అమ్మాయి పై ప్రేమ పేరుతో రోహిత్ అనే వ్యక్తి దాడి చేయడం చాలా బాధాకరం అన్నారు. వెంటనే అతనిని కఠినంగా శిక్షించాలని అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి అమ్మాయిలకు రక్షణ కల్పించి భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకురాలు దివ్య, మౌనిక, శ్రీ వాణి, అంజలి, అనూష, రాజ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్