ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం జరిగింది. కిరాణం షాపు వ్యాపారి మార్త సురేష్ (45)కి ఇటీవల అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.