వరంగల్ జిల్లా నల్లబెల్లి, మహబూబా బాద్ జిల్లా కొత్తగూడ మండలాల్లో సంచరించిన పులి ఒక్కటేనని శనివారం అటవీశాఖ అధికారి రవికిరణ్ తెలిపారు. ములుగు జిల్లా అడవుల నుంచి నల్ల బెల్లి మండలం కొండాపురంలోని వన్యప్రాణి అటవీ ప్రాంతంలోకి వచ్చి అక్కడి నుంచి కొత్తగూడ మండలం కోనాపురం వరకు వెళ్లి తిరిగి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పులి రాత్రి 35 కి. మీ దూరం నడుస్తుందని. పగలంతా బయటకు రాకుండా సురక్షిత ప్రాంతంలో ఉంటుందని చెప్పారు.