దేవరుప్పుల మండలం బీఎస్పీ అధ్యక్షుడిగా చింత గణేష్ నియామకం

54చూసినవారు
దేవరుప్పుల మండలం బీఎస్పీ అధ్యక్షుడిగా చింత గణేష్ నియామకం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం బీఎస్పీ అధ్యక్షుడుగా చింత గణేష్ నియమితులయ్యారు. శుక్రవారం దేవరుప్పుల మండల కేంద్రంలో బీఎస్పీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ చిలుముల కృష్ణ, అధ్యక్షుడు పడమటింటి భాస్కర్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా చింత గణేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ వారికి ధన్యవాదాలు తెలిపి మండల పరిధిలో బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్