నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన డోనికెన వెంకటయ్య కుటుంబానికి కొమ్ములవంచ హెల్పింగ్ హాండ్స్ గ్రూపు తరుపున గురువారం 75 కేజీల బియ్యం, 5 కేజీల వంటనూనె అందించారు. గ్రామంలో ఇలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తునందుకు కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పృథ్వి, రాంబాబు, సతీష్, తిరుమలేష్, రాజు, విజయ్, ఉపేందర్, పీటర్, శ్రీకాంత్, అరవింద్, మనోహర్, భావనరుషి తదితరులు పాల్గొన్నారు.