ఉప్పలయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం

462చూసినవారు
ఉప్పలయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం
తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన చిట్యాల ఉప్పలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు పద్మశాలి యువజన సంఘం (రి. నెం 327/22) వ్యవస్థాపకులు వన్నాల సాగర్ ఆద్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా శ్రీ పద్మశాలి యువజన సంఘం అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలి యువజన సంఘం పట్టణ, మండల అధ్యక్షులు వంగ అమరేందర్, గౌరీ శ్రీనివాస్, నాయకులు అంకం సురేష్, బైరు లక్ష్మీనారాయణ, పెండెం ప్రేమ్, భోగ కుమార్, మార్గo ఉపేందర్, జంజీరాల మనోహర్, సామల రాజు, జుంజునూరు కేదారి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్