జనగామ జిల్లా పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదివారం సాయంత్రం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 26, 80, 000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.