కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

57చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తోర్రూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపురం గ్రామానికి చెందిన వంద మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఝాన్సీ రెడ్డి సమక్షంలో చేరగా ఆమె వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్